నీ కవ్వించే కనులను అడగనా...
కలకాలం నా తోడు ఉండమని
నీ మృధు మాటలను అడగనా...
ప్రతి రాత్రి నాకు జోల పాడమని
నీ చిరునవ్వుని అడగనా....
నా కష్టసుఖాల్లో వెంటుండమని
నీ మనసుని అడగనా...
నాతో జీవితం పంచుకోమని
కాలచక్రాన్ని అడగనా...
నే నీతో ఉన్న క్షణాన్న ఆగిపొమ్మని
ఏమని అడగాలి?? ఎలా తెలపాలి??
నా కన్నుల తెలుపవా నీకు
నీ మీద నా ప్రేమని
No comments:
Post a Comment